టాలీవుడ్ ట్రెండింగ్.. నాగ చైతన్య గుర్తులను చెరిపేస్తున్న సమంత

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య - సమంత (Nagachaitanya samantha) జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

samantha black gown
రీమోడల్ చేసిన గౌనులో సమంత Photo: Twitter

ఈవార్తలు, టాలీవుడ్ న్యూస్: టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య - సమంత (Nagachaitanya samantha) జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లయిన నాలుగేళ్లకే వీళ్లు విడిపోయారు. ఆ తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటూ వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

తాజాగా, సమంత చేసిన ఒక పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి సందర్భంగా క్రైస్తవ పద్ధతిలో చేసుకున్న తంతు కోసం ప్రత్యేకంగా వైట్ గౌనును డిజైన్ చేయించుకుంది. అయితే, ఇప్పుడా గౌనును బ్లాక్ కాక్‌టెయిల్ స్ట్రాప్‌లెస్ గౌనుగా మార్చేసింది. ముంబైలో జరిగిన ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల కార్యక్రమంలో ఆ గౌనును ధరించి మెరిసింది. ఆ గౌనును ధరించి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. తనకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్‌ చేయించానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. 

తన పెళ్లి గౌనును సమంత రీమోడలింగ్ చేయించటంపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. నాగచైతన్య గుర్తులను చెరిపేసుకొనే చర్యల్లో భాగంగానే సమంత గౌనును ఇలా మార్చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, సమంత రీమోడలింగ్ చేయించిన గౌను అద్భుతంగా ఉందని పేర్కొంటున్నారు.

వెబ్ స్టోరీస్