కొరటాలను చిరంజీవి ప్రతిసారి టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| కొరటాలను చిరంజీవి ప్రతిసారి టార్గెట్ చేయడానికి కారణం అదేనా? || ఈ మధ్య చిరంజీవి చేతికి ఎప్పుడు మైకు వచ్చినా  శివాలెత్తినట్టు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా దర్శకులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. టాలీవుడ్ లో చాలామంది దర్శకులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని.. కనీసం వర్క్ షాప్ కూడా మెయింటైన్ చేయడం లేదని.. కాస్ట్ కటింగ్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారు అంటూ విమర్శలు కురిపిస్తున్నాడు మెగాస్టార్. సీనియర్లు చెప్పిన మాట వినడం లేదు అంటూ సెటైర్లు వేస్తున్నాడు. మొన్నటికి మొన్న వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ మీట్లో కూడా ఈ తరం దర్శకులపై విరుచుకుపడ్డాడు మెగాస్టార్ చిరంజీవి. అందరూ కాదు గాని కొందరు మాత్రం కచ్చితంగా నిర్మాతలకు అదనపు భారం పెంచేస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఈ కామెంట్స్ అన్ని కొరటాల శివను ఉద్దేశించి చిరంజీవి అంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. 

తాను కొరటాలను విమర్శించడం లేదని.. జనరల్ గా చెప్తున్నాను అంటూ చిరంజీవి పదేపదే క్లారిటీ ఇస్తున్నా కూడా వీటి మీద వార్తలు మాత్రం అసలు ఆగడం లేదు. దానికి తోడు చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ ఆచార్య మాత్రమే. ఖైదీ నెంబర్ 150 బాగానే ఆడింది. సైరా ఫలితంతో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాడ్ ఫాదర్ సినిమాకు కూడా చిరంజీవి సంతృప్తికరంగానే ఉన్నాడు. ఆచార్య సినిమాతోనే దారుణంగా బుక్కయ్యాడు. మెగాస్టార్ పైగా తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన మొదటి సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ కావడంతో ఇప్పటికి ఆ ఫలితాన్ని తీసుకోలేకపోతున్నాడు చిరంజీవి. ఆ కసి, కోపం బయటికి ఎలా చూపించాలో తెలియక దర్శకులకు క్లాస్ తీసుకుంటున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. 

నిజానికి ఆచార్య సినిమాలో దాదాపు అరడజన్ సన్నివేశాలు చిరంజీవి మేజర్ మార్పులు చెప్పాడని.. అయితే దానికి కొరటాల ఒప్పుకోలేదని తెలుస్తుంది. దానికి తోడు బడ్జెట్ విషయంలో కూడా చిరంజీవి మాటను కొరటాల పెడచెవిన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మెగాస్టార్ మిగిలిన దర్శకులు అందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలని పదేపదే దర్శకులకు క్లాస్ తీసుకుంటున్నాడు. 10 కోట్లు పెట్టే దగ్గర 20 కోట్ల బడ్జెట్ పెడితే.. కచ్చితంగా అది రేపు సినిమా విడుదలైన తర్వాత ఫలితంపై భారీ ప్రభావం చూపిస్తుందని చిరంజీవి ఎప్పటినుంచో చెప్తున్నాడు. గతంలో తను నటించిన ఎన్నో సినిమాలు నిరాశ పరిచిన కూడా నిర్మాత సేఫ్ అయ్యాడని.. దానికి కారణం బడ్జెట్లో సినిమా చేసుకోవడం అంటూ గుర్తు చేశాడు. అది ఈ తరం దర్శకులకు లేదని.. ఆ ప్లానింగ్ లేకపోతే సినిమాలు ఎంత బాగా తీసిన వృధానే అంటూ ఇన్ డైరెక్ట్ గా కొరటాలకు సెటైర్లు వేస్తూనే ఉన్నాడు మెగాస్టార్. ఆచార్య సినిమా సమయంలో తన సీనియారిటీతో ఇచ్చిన సలహాలు ఆయన పట్టించుకోకపోవడంతోనే చిరు బాధతో దర్శకులకు ఇలాంటి సలహాలు ఇస్తున్నాడని తెలుస్తోంది. మరి దర్శకుల మీద చిరుకు ఈ కోపం ఎప్పటికి తగ్గుతుందో చూడాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్