Meenakshi Chaudary | మీనాక్షి చౌదరికి మరో చాన్స్‌.. ఇద్దరు హీరోయిన్లతో నాగచైతన్య రొమాన్స్..

Meenakshi chaudhary తెలుగులో ఇప్పుడు బిజీ హీరోయిన్ ఎవరు? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా మారింది.

meenakshi chaudari

మీనాక్షి చౌదరి

ఈవార్తలు, టాలీవుడ్ : తెలుగులో ఇప్పుడు బిజీ హీరోయిన్ ఎవరు? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా మారింది. ఈ ఏడాది మొత్తగా గుంటూరు కాలంలో సినిమాలో మహేశ్‌కు మరదలుగా నటించి మెప్పించింది. దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో మట్కాలో ఆడి పాడింది. ఈ వారం విడుదల కానున్న విశ్వక్‌సేన్ సినిమా.. మెకానిక్ రాకీలోనూ కథానాయిక ఈ బ్యూటీనే. ఇక.. వచ్చే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు? అంటే మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

ఇక.. ఇప్పుడు నాగ చైతన్య సరసన చేయబోయే సినిమాలోనూ మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న నాగచైతన్య.. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మరోసినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తోందని సమాచారం. అంటే.. ఇద్దరు భామలతో నాగచైతన్య రొమాన్స్ చేయబోతున్నాడు. చైతూ పక్కన నటించడనుండటం మీనాక్షికి ఇదే తొలిసారి కాగా.. పూజా హెగ్డే తన తొలి తెలుగు చిత్రాన్ని నాగ చైతన్య సరసన చేసింది. ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్