మీనాక్షి నిర్ణయం కరక్టేనా?
మీనాక్షి చౌదరి
సీనియర్ హీరోలతో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటూ ముందుకొచ్చింది..మీనాక్షి చౌదరి. అలా నటించడాన్ని తాను ఓ కొత్త జోనర్ గానే భావిస్తానంది. ఓ రకంగా మేకర్స్ కు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. 30 ఏళ్ల నాయికలెవరు? సీనియర్లతో అంటే ముందుకురారు. కానీ మీనాక్షి లాంటి ఫేమస్ అయిన నటి వచ్చిందంటే హర్షించదగ్గ విషయమే. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది? అన్నది పక్కన బెడితే నటిగా మాత్రం పెద్దగా నిబంధనలు పెట్టుకోకుండానే పనిచేస్తుందని చెప్పొచ్చు. 'లక్కీ భాస్కర్' చిత్రంలో అమ్మడు పిల్లల తల్లిగానూ నటించిన సంగతి తెలిసిందే. అలాగే సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకీ గాళ్ ప్రెండ్ పాత్రలోనూ అలరించింది. ఇలా మీనాక్షి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంది. యంగ్ హీరోలే కావాలంటూ కూర్చోలేదు. మంచి అవకాశం...గొప్ప పాత్ర అనుకున్న ప్రతీ సినిమా చేసింది. మరి మీనాక్షి నిర్ణయాన్ని గౌరవించి ఎంత మంది సీనియర్ హీరోలతో అవకాశం కల్పిస్తారో చూడాలి. మీనాక్షి లాగే శ్రీలీల కూడా సీనియర్లకు సై అనేసింది. ఇప్పటికే రెండు సార్లు రవితేజకు జోడీగా నటించింది. ధమాకా`లో ఓసారి..తాజాగా రిలీజ్ అయిన `మాస్ జాతర`తో రెండవ సారి రాజాతో షురూ చేసింది. తొలుత రవితేజకు కుమార్తెలా ఉందని..ఆయనకు జోడీగా ఏంటని విమర్శలొచ్చినప్పటికీ `మాస్ జాతర రిలీజ్ సమయానికి మాత్రం ఆ విమర్శలన్నీ తొలగిపోయాయి. శ్రీలీల మాస్ అప్పిరియన్స్ తో మాస్ స్టార్ కి సరితూగిందనే ప్రశంస అందుకుంది. శ్రీలీల వయసు మీనాక్షి కంటే నాలుగేళ్లు తక్కువే. ప్రస్తుతం అమ్మడికి 24 ఏళ్లే. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటోంది. అవకాశం వస్తే మరింత మంది సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి శ్రీలీల సిద్దమే. అలా మీనాక్షి, శ్రీలీల సీనియర్లకు ఓ ఆప్షన్ గా చూడొచ్చు.