కేవలం బ్రాండ్‌తోనే సినిమాలు ఆడేస్తాయా.. కథ అవసరం లేదా? మ్యాడ్ స్క్వేర్‌తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్స్ చూసాక నాకు వచ్చిన డౌట్ ఇది. ఫస్ట్ పార్ట్ హిట్టైంది కదా అని.. కథ లేకుండానే పార్ట్ 2 తీస్తున్నారు. బ్రాండ్‌తో బయటపడిపోవాలని చూస్తున్నారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే బాపతు.
ప్రతీకాత్మక చిత్రం
కేవలం బ్రాండ్‌తోనే సినిమాలు ఆడేస్తాయా.. కథ అవసరం లేదా? మ్యాడ్ స్క్వేర్‌తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్స్ చూసాక నాకు వచ్చిన డౌట్ ఇది. ఫస్ట్ పార్ట్ హిట్టైంది కదా అని.. కథ లేకుండానే పార్ట్ 2 తీస్తున్నారు. బ్రాండ్‌తో బయటపడిపోవాలని చూస్తున్నారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే బాపతు. కథ లేదు అక్కడక్కడ కామెడీ తప్ప. ఇలాంటి సినిమాలో లాజిక్స్ వెతక్కూడదు. జస్ట్ ఎంజాయ్ చేయాలంతే. పోనీ అలా చేయాలన్నా కూడా కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉండాలి కదా. మ్యాడ్ చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. ఎక్కడా బోర్ కొట్టదు. కానీ మ్యాడ్ స్క్వేర్ అలా కాదు. ప్లాన్ చేసి బ్రాండ్ కోసమే తీసిన సినిమా ఇది. ఇందులో కూడా కొన్ని సీక్వెన్సులు బాగా పేలాయి.. బాగా నవ్వించారు. ఫస్టాఫ్‌లో లడ్డూ పెళ్లి సీక్వెన్స్.. సెకండాఫ్‌లో ఎంటైర్ సునీల్ ఎపిసోడ్ అదిరిపోయాయి.
నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటే డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఏదో వీకెండ్‌కు సరదాగా నవ్వుకుందాం అనుకుంటే మ్యాడ్ స్క్వేర్ పర్లేదు. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ మరోసారి నవ్వించారు. లడ్డూగా విష్ణు కూడా అదరగొట్టాడు. సునీల్ చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించాడు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈసారి కాస్త తడబడ్డాడు.
ఓవరాల్‌గా మ్యాడ్ స్క్వేర్.. డబుల్ డోస్ కాదు కానీ బతికించిన మ్యాడ్ బ్రాండ్
సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు