|| ప్రతీకాత్మక చిత్రం ||
ప్రేక్షకులు ఎదురుచూస్తున్న థియేటర్ సినిమాలు, ఓటిలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఈవారం రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం మైఖేల్, బుట్ట బొమ్మ, రైటర్ పద్మభూషణ్, సువర్ణ సుందరి, ప్రేమదేశం, వెయ్ దరు వెయ్ సినిమాలు థియేటర్లో విడుదల కాబోతున్నాయి.
ఈవారం థియేటర్లో విడుదల కాబోయే సినిమాలు ఇవే..
థియేటర్ :
ఫిబ్రవరి 3న : మైఖేల్
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ కోడి తెరకెక్కిస్తున్న సినిమా ‘మైఖేల్’.
ఫిబ్రవరి 3న : రైటర్ పద్మభూషణ్
సుహాస్, టినా శిల్ప రాజ్ హీరో హీరోయిన్లుగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా తెరకెక్కింది. ఈ
ఫిబ్రవరి 3న : సువర్ణ సుందరి
పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సువర్ణ సుందరి’. సురేంద్ర మాచారపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 3న : ప్రేమదేశం
త్రిగుణ్, మేఘా ఆకాశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ప్రేమదేశం. ఈ సినిమాకు శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు.
ఫిబ్రవరి 3న : వెయ్ దరువెయ్
సాయి రామ్ శంకర్, యషా శివ కుమార్, సత్యం రాజేష్, దేవ రాజ్ పొత్తూరు, పోసాని కృష్ణ మురళి, మరియు పృధ్వి ప్రముఖ పాత్రల్లో నటించారు. దీనికి నవీన్ రెడ్డి డి దర్శకత్వం వహించారు.
ఫిబ్రవరి 4న : బుట్టబొమ్మ
అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు టి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..
సోనీలివ్
ఫిబ్రవరి 3 : జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ)
ఆహా
ఫిబ్రవరి 3 : అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీ కే (టాక్ షో పవన్ కల్యాణ్ ఎపిసోడ్-1)
డిస్నీ+హాట్‌స్టార్
ఫిబ్రవరి 1 : బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్)
ఫిబ్రవరి 3 : సెంబి (తమిళం)
నెట్‌ఫ్లిక్స్
ఫిబ్రవరి 3 : క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1)
ఫిబ్రవరి 3 : ట్రూ స్పిరిట్
ఫిబ్రవరి 3 : ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్)
ఫిబ్రవరి 3 : స్ట్రామ్ బాయిల్
ఫిబ్రవరి 3 : వైకింగ్ ఊల్ఫ్