|| దుబాయ్‌లో విజయ్, రష్మిక, Photo: Twitter ||
టాలీవుడ్ కుర్రాళ్ళ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య అసలు ఏం జరుగుతోంది.. వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా .. ప్రేమలో ఉన్నారా.. అభిమానులకు వీరి వెకేషన్ ఫొటోస్, తరచు విజయ్ ఇంటికి రష్మిక రావడం వెనక ఏముంది.. వీరిద్దరూ కలిసి నటించిన రెండు సినిమాల నుండి వీళ్ళ ప్రేమాయణం మొదలైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. వాళ్ల అనుమానమే నిజమయ్యేలా వీరి ఫొటోస్ రీసెంట్ గా మాల్దీవులు వెకేషన్ వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లుకొట్టాయి. కానీ వీటిపై రష్మిక స్పందించి తాము మంచి స్నేహితులమని మేము కలిసి వెకేషన్ కి వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించింది. మేమిద్దరం మంచి స్నేహితులమే అని కొట్టి పడేసింది.
అయితే తాజాగా వీరిద్దరు దుబాయిలో వెకేషన్ వెళ్లిన ఫొటోస్ అభిమానులను ఆలోచింపజేస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా, వీళ్ళిద్దరూ మొదటిసారిగా కలిసి రష్మీక నవ్వుతున్న వెకేషన్ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరూ ఈ వెకేషన్ పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తమ ఇరువురి మధ్య ఉన్నది స్నేహమా.. ప్రేమనా.. అని అభిమానుల కామెంట్లకు సమాధానం ఎలా వస్తుందో చూడాల్సిందే..