Bhool Bhulaiyaa 3 Review| భూల్ భులయ్యా 3 సినిమా ఎలా ఉందంటే..

దెయ్యాల సినిమాల్లో కొత్తగా చెప్పడానికి ఏముండదు. అదే పాడుబడిన కోట.. అందులో ఓ దెయ్యం.. అక్కడే కాసేపు కామెడీ.. కాసేపు సస్పెన్స్.. చివర్లో ట్విస్ట్. అన్ని సినిమాల్లోనూ ఇదే కథ.. భూల్ భులయ్యా 3 కూడా దీనికి మినహాయింపు కాదు.

bool bhulayya 3
భూల్ భులయ్యా 3 పోస్టర్ Photo: Facebook

దెయ్యాల సినిమాల్లో కొత్తగా చెప్పడానికి ఏముండదు. అదే పాడుబడిన కోట.. అందులో ఓ దెయ్యం.. అక్కడే కాసేపు కామెడీ.. కాసేపు సస్పెన్స్.. చివర్లో ట్విస్ట్. అన్ని సినిమాల్లోనూ ఇదే కథ.. భూల్ భులయ్యా 3 కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సినిమా క్లైమాక్స్‌ రొటీన్ కాకుండా.. కాస్త కొత్తగా ట్రై చేసారు. అది కూడా ఈ మధ్య మనం ఓ తెలుగు సినిమాలో చూసిందే. అక్కడక్కడా ఛమక్కులు తప్పిస్తే.. భూల్ భులయ్యా 3లో కొత్తగా అయితే ఏం లేదు. భూల్ భులయ్యా 2 చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పార్ట్ 3లో అది చాలా వరకు మిస్ అయింది. హార్రర్ కూడా పెద్దగా అనిపించదు. కథ అక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్.. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కార్తిక్ ఆర్యన్ మరోసారి రూహి బాబాగా రప్ఫాడించాడు. మనోడి ఎనర్జీ సినిమాకు ప్రాణం. త్రిప్తి దిమ్రి ఓకే. గ్లామర్ షో బాగానే చేసింది. మాధురి దీక్షిత్, విద్యా బాలన్ పోటీ పడి నటించారు. దర్శకుడు అనీస్ బజ్మీ స్క్రీన్ ప్లేపై ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండు అనిపించింది.

ఓవరాల్‌గా భూల్ భులయ్యా 3.. రొటీన్ యావరేజ్ హార్రర్ కామెడీ.

సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్