||కంగన రనౌత్, ప్రియాంక చోప్రా Photo: twitter||
ఈవార్తలు, సినిమా న్యూస్: యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ను విడిచి పెట్టి వెళ్లిపోవటానికి కారణం ఎవరో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెల్లడించింది. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ వల్లే ప్రియాంక హాలీవుడ్‌కు వెళ్లిపోయిందని చెప్పింది. ప్రియాంక చోప్రాను కరణ్ బ్యాన్ చేశాడని ఆమె ఆరోపించింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా క్లోజ్‌గా ఉండడం ఆయన తట్టుకోలేకపోయాడని, ఆమెను మానసికంగా వేధించాడని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేసింది. ‘పరిశ్రమలోని కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంక చోప్రాను అవమానించారు. సినీ పరిశ్రమ నుంచి పారిపోయేలా చేశారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలిపోయేలా చేశారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని మీడియాల్లో కథనాల వచ్చాయి. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చే మూవీ మాఫియాకు ప్రియాంక దొరికింది. అమితాబ్, షారుక్ వంటి వారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’ అని కంగన వెల్లడించింది.
కాగా, బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ప్రియాంక చోప్రా ఒక్కసారిగా హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాల వల్లే తాను హాలీవుడ్‌కు వచ్చేశానని తెలిపింది. ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై కంగన, వివేక్ అగ్నిహోత్రి లాంటివారు ప్రియాంకకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.