మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరోయిన్గా నటించి, తన అందంతో నటనతో అందరిని ఆకర్షించిన నటి ప్రీతి ముకుందన్. ఈ సినిమాతో ప్రీతి ముకుందన్ భారీ పాపులారిటీ అందుకుంది.
ప్రీతి ముకుందన్
మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరోయిన్గా నటించి, తన అందంతో నటనతో అందరిని ఆకర్షించిన నటి ప్రీతి ముకుందన్. ఈ సినిమాతో ప్రీతి ముకుందన్ భారీ పాపులారిటీ అందుకుంది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరిచారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లే కావడం గమనార్హం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. అయితే ఈ సినిమాలో ఆయేషా ఖాన్ హైలెట్ అయిన రేంజ్‌లో ప్రీతి ముకుందన్ కి గుర్తింపు లభించలేదు. తర్వాత యంగ్ హీరో కెవిన్ హీరోగా వచ్చిన స్టార్ అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలతో పోల్చుకుంటే కన్నప్ప సినిమా పెద్ద మూవీ మాత్రమే కాదు ఇందులో భారీతారాగణం కూడా భాగమైంది. పైగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవ్వడంతో ఈ సినిమాలో ఈమెకు మరింత క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌కు గ్లామర్ విందు వడ్డించింది.