Bharateeyudu 2 Review | సముద్రంతో సెల్ఫీ దిగిన తర్వాత పిల్లకాలువ పక్కన నిలబడి ఫోజ్ ఇస్తే ఎలా ఉంటుంది? భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు 2 మీద అలాగే ఉంది. బాహుబలి ఇంటర్వెల్ లో రానాను డామినేట్ చేసే ప్రభాస్ విగ్రహంలా.. సినిమా అంతా నాటి సేనాపతి.. నేటి సేనాపతిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు.
భారతీయుడు2 సినిమా రివ్యూ
సముద్రంతో సెల్ఫీ దిగిన తర్వాత పిల్లకాలువ పక్కన నిలబడి ఫోజ్ ఇస్తే ఎలా ఉంటుంది? భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు 2 మీద అలాగే ఉంది. బాహుబలి ఇంటర్వెల్ లో రానాను డామినేట్ చేసే ప్రభాస్ విగ్రహంలా.. సినిమా అంతా నాటి సేనాపతి.. నేటి సేనాపతిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. భారతీయుడు లాంటి సినిమాకు సీక్వెల్ అంటేనే సాహసం. అది రిస్క్ అని తెలిసినా చేశాడు శంకర్.. ఓ అద్భుతం చూసాక.. మళ్ళీ అది సృష్టించడం శంకర్ వల్ల కూడా కాదు.. భారతీయుడు అనేది ఓ ఎమోషన్. పైగా లంచం, అవినీతిపై ఎక్స్ పోజర్ ఈ స్థాయిలో లేదప్పుడు..అప్పట్లో అది భీభత్సంగా కనెక్ట్ అయింది. కానీ సీక్వెల్ లో ఆ ఎమోషన్ మిస్ అయింది. శంకర్ ను ముందు నుంచి ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఇదే. దీన్ని ఓవర్ కమ్ చేయడంలో ఈయన సైతం తడబడ్డాడు. స్క్రీన్ ప్లే కూడా అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తుంది. కొన్ని శంకర్ మార్క్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సేనాపతి తిరిగొచ్చే సీన్ అదిరింది. ఇంటర్వెల్ బాగుంది.. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్. కానీ మిగిలిన రొటీన్ సీన్స్ కారణంగా ఇవి హైలైట్ అవ్వలేదు. 2024లో భారతీయుడు తిరిగొస్తే ఆయనకు కూడా చుక్కలు తప్పవని సినిమాలో చూపించాడు శంకర్.
బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ కష్టాలు తప్పకపోవచ్చు
కమల్ హాసన్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు
దివంగత నటులు వివేక్, నెడుమూడి వేణులను AIలో అద్భుతంగా చూపించారు
శంకర్ మేకింగ్ లో భారీతనం కనిపించింది.. కానీ మార్క్ మిస్ అయింది
అనిరుధ్ కూడా అంతగా మెప్పించలేదు
కమల్ చెప్పినట్టు పార్ట్ 3 ఆసక్తికరంగా ఉండబోతుందని క్లైమాక్స్ లో చూపించిన షో రీల్ చూస్తే అర్థమైంది
ఓవరాల్ గా భారతీయుడు 2.. కాస్త మెప్పిస్తాడు.. కాస్త విసిగిస్తాడు
సమీక్షకుడు: వడ్ల ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు