Childrens Day : పిల్లల కోసం కల్కి టీమ్ స్పెషల్ ఆఫర్.. బుజ్జిని కలుసుకునే అవకాశం

ప్రభాస్, దిశాపటానీ, దీపికా పడుకోన్, కమల్ హాసన్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఎంటర్‌టైన్ చేసిన మరో పాత్ర బుజ్జి. ప్రభాస్‌కు తోడుగా సాహసాలు చేస్తూ, ప్రభాస్‌ను ఆటపట్టించేలా బుజ్జి (కారు) చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

prabhas bujji

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : ప్రభాస్, దిశాపటానీ, దీపికా పడుకోన్, కమల్ హాసన్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఎంటర్‌టైన్ చేసిన మరో పాత్ర బుజ్జి. ప్రభాస్‌కు తోడుగా సాహసాలు చేస్తూ, ప్రభాస్‌ను ఆటపట్టించేలా బుజ్జి (కారు) చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బుజ్జికి కీర్తి సురేశ్ వాయిస్.. మరింత ఊపు తెచ్చింది. కీర్తి సురేశ్ వాయిస్ నచ్చి దర్శకులు అన్ని భాషల్లో ఆమె వాయిస్‌నే వాడారు. అయితే, చిల్ట్రన్స్ డే సందర్భంగా కల్కి టీమ్ పిల్లల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. పిల్లలు బుజ్జిని కలుసుకునే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీ్ప్లెక్స్‌లో బుజ్జితో సమయం గడిపే అవకాశం కల్పిస్తున్నట్లు వైజయంతి మువీస్ టీం వెల్లడించింది. అంతేకాదు.. లిమిటెడ్ ఎడిషన్ క్లాత్స్ సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా, కల్కి ఫస్ట్ పార్టుకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. 60 శాతం షూటింగ్ కూడా పూర్తయినట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించాడు. ఫస్ట్ పార్టుకు పట్టిన సమయం కంటే.. రెండో పార్టుకు తక్కువ సమయమే పడుతుందని, అనుకున్న సమయం కంటే ముందే రెండో పార్టును విడుదల చేస్తామని పేర్కొన్నాడు. కల్కి 2898 ఏడీ (ఫస్ట్ పార్టు) జూన్ 27న విడుదల అవ్వగా, బాక్సీఫీస్ వద్ద రూ.1,110 కోట్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్