Kalki Movie Review | ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. నా దృష్టిలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని మన పురాణాలకు లింక్ పెడుతూ రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
కల్కి సినిమా రివ్యూ Photo: Facebook
ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి. నా దృష్టిలో కల్కి అలాంటి ఒక అద్భుతం. మహాభారతంలోని పాత్రలు తీసుకొని మన పురాణాలకు లింక్ పెడుతూ రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది సక్సెస్ అయ్యిందా లేదంటే సాగదీసాడా ఇవన్నీ పక్కన పెడితే, ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్ చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కల్కి నెక్స్ట్ లెవెల్. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ గ్యారంటీ. సినిమా మొదటి 15 నిమిషాలు అద్భుతంగా మొదలైంది. ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ గానే ముందుకు సాగింది.
ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం కాస్త టైం తీసుకున్నాడు నాగ్ అశ్విన్. అశ్వద్ధామ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. మధ్య మధ్యలో వచ్చే మహాభారతం రిఫరెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. రొటీన్ కమర్షియల్ కోణంలో చూస్తే మాత్రం కల్కి అందరికీ నచ్చదు. అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్న వాళ్లకు మాత్రం ఇది నిజంగానే ఒక అద్భుతం. రెండు ప్రపంచాలను లింకు పెడుతూ ఇలాంటి కథ రాసుకోవడమే చాలా కాంప్లికేటెడ్. అందుకే నాగ్ అశ్విన్ కూడా స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కాస్త తడబడినట్టు అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్ లెంత్ పెంచాడు దర్శకుడు.
బుజ్జి, భైరవ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ లేదు. అతడి జోడి బుజ్జినే. సినిమా అంతా ఒకెత్తు అయితే, మొదటి, చివరి 15 నిమిషాలు మరొక ఎత్తు. క్లైమాక్స్ అయితే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే.. మాటల్లేవు. ప్రభాస్ మరోసారి అదరగొట్టాడు.. కామెడీ పోర్షన్ కూడా తనే తీసుకున్నాడు. ఈ సినిమాకు అసలైన హీరో అమితాబ్ బచ్చన్. ఆయన కాకుండా అశ్వద్ధామగా ఇండియాలో ఇంకే నటుడు సరిపోడు. కమల్ హాసన్ ఉన్నది కాసేపైనా మ్యాజిక్ చేశాడు. దీపికా పడుకోన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. మరో రెండు మూడు క్యామియోలు ఉన్నాయి. అది సినిమా చూసి తెలుసుకోండి. టెక్నికల్ గా కల్కికి తిరుగులేదు.
ఓవరాల్ గా కల్కి 2898 ఏడీ.. సరికొత్త విజువల్ ప్రపంచం.
సమీక్షకుడు: వడ్ల ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు