Deepika Padukone Pregnancy Photoshoot: బేబీ బంప్‎తో కల్కీ బ్యూటీ.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బేబీ బంప్‌తో ఉన్న అందమైన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. దీంతో రణ్‌వీర్‌, దీపికా బిడ్డ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Deepika Padukone Pregnancy Photoshoot

దీపికా పదుకొనే బేబీ బంప్‌

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన మొదటి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. దానిని నటి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీపిక-రణ్‌వీర్ ఫోటోషూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత అభిమానుల్లో తమ బిడ్డను స్వాగతించాలనే ఉత్సాహం మరింత పెరిగింది.త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ ప్రముఖ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తాజాగా ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేశారు. దీపికా, రణవీర్‌ల అందమైన చిత్రాలు వారి అభిమానుల హృదయాలను తాకాయి. ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.  ఈ ఫోటోషూట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అయ్యాయి. దీపిక బేబీ బంప్ గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. నటి బేబీ బంప్ పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఈ పుకార్ల మధ్య, రణవీర్, దీపికల ఈ ఫోటోషూట్ తో పుకార్లకు చెక్ పెట్టారు. ప్రత్యేక డిజైన్ చేసిన డ్రెస్సులో దీపికా మెరిసిపోయారు. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్సులో దీపిక తన భర్త రణవీర్ తో కలిసి దిగిన ఈ ఫోటో షూట్ ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్