|| అమిగోస్ సినిమా ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ||
ఈవార్తలు, సినిమా న్యూస్: ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి అప్‌డేట్ లేదని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే, అన్న కల్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అప్‌డేట్ కచ్చితంగా ఉంటుందని ఆశపడ్డ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే శుభవార్త అందించాడు. కొత్త సినిమా ప్రారంభం ఈ నెలలోనే ఉంటుందని ప్రకటించాడు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన తారక్.. ఈ నెలలోనే కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, మార్చి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని స్పష్టం చేశాడు. ఆ సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించాడు. హీరోయల కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇంట్లో భార్య కన్నా ముందు అభిమానులకే చెప్తామని అన్నాడు. అప్‌డేట్ ఇవ్వాలని హీరోలు, దర్శకులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరాడు.
కాగా, ఎన్టీఆర్30 పేరుతో చాలా రోజుల క్రితం ఒక పోస్టర్ విడుదలైంది. కొరటాల శివ దర్శకుడిగా ఈ సినిమా ఉంటుందని ప్రకటన ఇచ్చారు. అయితే, 8 నెలల నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో తారక్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఇప్పుడు తారక్ కొత్త సినిమాపై అప్‌డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించే ఎన్టీఆర్ 30 సినిమాకు దేవర అన్న టైటిల్ పెట్టే చాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.