Devara OTT Release | నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎన్టీఆర్ దేవర .. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర సినిమా ఓటీటీ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా విడుదలైన 40 రోజులకు ఓటీటీలోకి వస్తోంది.

devara ott release

నవంబర్ 8న ఓటీటీలోకి దేవర Photo: www.x.com

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర సినిమా ఓటీటీ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా విడుదలైన 40 రోజులకు ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 8వ తేదీన (శుక్రవారం) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ ప్రకటిస్తూ.. అప్పుడప్పుడు ధైర్యానికి తెలియదు. అవసరానికి మిచి తను ఉండకూడదు అని. అప్పుడు భయానికి తెలియాలి. తాను రావాల్సిన సమయం వచ్చిందని. ఇక వస్తున్నాడు దేవర. శుక్రవారం (నవంబర్ 8వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దేవర స్ట్రీమింగ్‌కు సిద్ధం. హిందీలోనూ త్వరలో రానుంది’ అని నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిన దేవర సినిమాను నెట్‌ఫ్లిక్స్ రూ.155 కోట్లు వెచ్చింది డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, జాన్వీ కపూర్ నటించిన దేవర-1 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యా్ణ్‌రామ్ తదితరులు నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. రెండు పార్టులుగా వస్తున్న దేవర సినిమా.. రెండో పార్టు వచ్చే ఏడాది విడుదల కానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్