తల్లిదండ్రులు కాబోతున్న జబర్దస్త్ జంట రాకింగ్ రాకేశ్ జోర్దార్ సుజాత దంపతులు

జబర్దస్త్ వేదికపై సూపర్ హిట్ జంటగా నిలిచిన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత దంపతులు తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

jabardasth comedy

అమ్మానాన్న పిలుపుకు దగ్గరలో రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత

హైదరాబాద్, ఈవార్తలు : జబర్దస్త్ వేదికపై సూపర్ హిట్ జంటగా నిలిచిన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత దంపతులు తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మధ్యే తెలగాణ అంటూ అద్భుతమైన సాంగ్‌ నిర్మించిన రాకింగ్ రాకేశ్.. తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. వీరిద్దరు పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే సుజాత సీమంతం అయ్యింది కూడా. ఈ మేరకు వారిద్దరు కలిసి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు. ఒక మంచి సమయం చూసి చెప్పాలి అనుకుంటున్నాం. రాకింగ్ రాకేశ్ తండ్రి కాబోతున్నాడు’ అని సుజాత చెప్పుకొచ్చింది.

ఈ మాటలకు ఎమోషనల్ అయిన రాకింగ్ రాకేశ్.. సీమంతం నిర్వహించామని వెల్లడించాడు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశాడు. సుజాత కడుపుతో.. రాకింగ్ రాకేశ్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అమ్మానాన్న అన్న పిలుపుకు దగ్గర్లో.. గొప్ప తల్లిదండ్రులు అవ్వాలని ఆశీర్వదించండి’ అని పోస్ట్ చేశాడు. వీరిద్దరికి శుభాకాంక్షలు చెప్తూ అభిమానులు రిప్లై ఇస్తున్నారు. సుజాత లాంటి అమ్మాయి పుడుతుందని, కాదు.. అబ్బాయే పుడతాడని.. అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్