||జాన్వీ కపూర్ Photo: twitter||
ఎన్టీఆర్ 30 సినిమా కొత్త అప్ డేట్స్ వచ్చేశాయ్. ఇన్ని రోజులు నుండి వస్తున్నా రూమర్స్ సినీ బృందం నిజం చేసింది. ఎన్టీఆర్ 30 సినిమాలో యంగ్ టైగర్ సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోఎంట్రీ ఇవ్వబోతుంది. జాన్వీ కపూర్ 26వ పుట్టినరోజు సందర్భంగా సినీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా పోస్టర్ సినీ బృందంతో పాటు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే తన ఎంతో అభిమానించే ఎన్టీఆర్ తో నటించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ జాన్వీ కపూర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆయనతో నటించి, బిగ్ స్క్రీన్ పైన కనిపించేందుకు వెయిట్ చేస్తున్నానంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ సినిమా నందమూరి తారకరత్న ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రెజెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్నట్లు తెలిపింది.