Jabardasth Roja | జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన రోజా సెల్వమణి.. ఆ స్పెషల్ ఎపిసోడ్ కోసమే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Photo : Jabardasth Promo Screen Shot; Credit : https://www.youtube.com/@ETVJabardasth)

ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్ : Jabardasth Roja | చాలా రోజుల తర్వాత జబర్దస్త్‌లోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్న రోజా.. తాజాగా, విడుదలైన ప్రోమోలో కనువిందు చేసింది. వచ్చేది 500వ ఎపిసోడ్ కాబట్టి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కృష్ణ భగవాన్, ఇంద్రజను సర్‌ప్రైజ్ చేసేలా రోజా ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కమెడియన్లు కూడా రోజాకు వెల్‌కమ్ చెప్పారు. జబర్దస్త్ జడ్జిగా తనదైన ముద్రవేసిన రోజా.. తాజాగా విడుదలైన ప్రోమోలోనూ పంచులతో అలరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనతో పాటు వచ్చిన ఎందరో హీరోయిన్లను ప్రేక్షకులు మర్చిపోయారని, తాను మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నానని, దానికి జబర్దస్తే కారణం అని తెలిపింది.

కాగా, రోజా కష్టాల్లో ఉన్నప్పుడు జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి క్రమంగా ఎదుగుతూ మంచి క్రేజ్ సంపాదించుకున్నది. జబర్దస్త్ అంటే రోజా.. రోజా అంటే జబర్దస్త్ అనేలా పేరు సంపాదించుకున్నది. అయితే, ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం దక్కటంతో, ప్రజా సేవ దృష్ట్యా జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్