||అనసూయ భరద్వాజ్ Photo: Instagram||
ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్ : అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ వేదికపై ఓ వెలుగు వెలిగిన యాంకర్. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు ఓ మంచి ఆర్టిస్ట్. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. పుష్ప సినిమాలో అనసూయ చేసిన పాత్ర తన నటనను చూపించింది. ఈ మధ్య రిలీజైన రంగమార్తాండ సినిమాలోనూ మెప్పించింది. అటు సినిమాల్లో, ఇటు బుల్లి తెరపై బిజీగా గడుపుతున్న, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా, ఆదివారం కాస్త సమయం దొరకటంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని.. అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తోంది? అని అడిగారు. దీనికి అనసూయ బదులిస్తూ.. ‘వాళ్ల దృష్టిలో ఆంటీ అంటే అర్థం వేరే. అందుకే కోపం వచ్చేది. ఇప్పుడు కోపం రావటం లేదు. అది వాళ్ల ఖర్మ. అంతే. నాకు ఎన్నో ముఖ్యమైన పనులున్నాయి. అలాంటి కామెంట్లను పట్టించుకోవడం మానేశా’ అని బదులిచ్చింది. ఈ నెల రెండో వారంలో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు పేర్కొంది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తాను శాకాహారినని చెప్పింది.