అది నా అదృష్టం.. దేవర బ్యూటీ జాన్వీకపూర్ కీలక వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జాన్వీ కపూర్ కూడా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందకు వెళ్దామా? అని ఆత్రుతతో ఉంది. అయితే, ఆలోగా ఆమె చేసిన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా దేవరలో తన పాత్ర గురించి ఆమె మాట్లాడింది.

janhvi kapoor
జాన్వీ కపూర్

ఈవార్తలు, సినిమా న్యూస్: శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఆ ఎఫెక్ట్ తనపై పడకుండా జాగ్రత్త పడింది. తండ్రి బోనీకపూర్ అండగా, సినిమాల్లో దూసుకుపోతోంది. ఇక ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాల్లో అడుగుపెడుతుందా? శ్రీదేవి కూతురిని ఎప్పుడు చూద్దామా? అని ఆశపడ్డ తెలుగు సినీ ప్రేక్షకులకు దేవర సినిమాతో ఆ కోరిక తీరనుంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జాన్వీ కపూర్ కూడా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందకు వెళ్దామా? అని ఆత్రుతతో ఉంది. అయితే, ఆలోగా ఆమె చేసిన తాజా చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా దేవరలో తన పాత్ర గురించి ఆమె మాట్లాడింది.

దేవర చిత్రంలో తంగం పాత్ర పోషిస్తున్నానని, అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని జాన్వీ తెలిపింది. షూటింగ్ సరదాగా జరిగిందని, సెట్‌లో అంతా తనపై ప్రేమతో ఉన్నారని వెల్లడించింది. దేవర కథ అందంగా, ప్రత్యేకంగా ఉంటుందని, ఈ సినిమాలో అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొంది. అందుకు తనకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పింది. ఇప్పటికే ఒక పాట విడుదల కాగా, రెండో పాటను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

కాగా, సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమాను అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్