||పూజా హెగ్డే Photo:Twitter||
ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్: గత మూడేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తున్న ఒకే ఒక హీరోయిన్ పూజా హెగ్డే. రష్మిక మందన్న బాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా కబ్జా చేసింది పూజ. ఇక్కడ స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. అయితే 2022 ఈమె కెరీర్ లో అత్యంత చెత్త ఏడాదిగా మిగిలిపోయింది. నాలుగు సినిమాలు చేస్తే అందులో ఒకటి కూడా హిట్ అవ్వకపోగా.. అన్ని ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఆచార్య, సర్కస్, రాధే శ్యామ్ సినిమాలు భారీ నష్టాలను తీసుకొచ్చాయి. దాంతో పాటు విజయ్ బీస్ట్ సినిమా కూడా ఆవరేజ్ దగ్గర ఆగిపోయింది. దాంతో పూజ హెగ్డే పేరు వింటే దర్శక నిర్మాతలు భయపడుతున్నారు.
ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా ఈమె సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. సక్సెస్ లలో లేని హీరోయిన్ కు అంత ఇవ్వడం ఎందుకు అనే ఆలోచన కూడా నిర్మాతలలో ఇప్పుడు మొదలైంది. అందుకే పూజా హెగ్డేకు వాళ్ళు అల్టిమేటమ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. పారితోషకం తగ్గించుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వకూడదు అని నిర్మాతలు నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా మహేష్ బాబు, త్రివిక్రమ్ ప్రాజెక్ట్. అది కూడా అక్కడ గురుజి ఉన్నాడు కాబట్టి వచ్చింది లేదంటే ఆ సినిమా కూడా వచ్చేది కాదు. పైగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈమె తప్పుకుంది.
డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇకపై పూజతో సినిమాలకు కమిట్ అవ్వాలంటే కచ్చితంగా ఇప్పుడున్న రెమ్యూనరేషన్ లో కనీసం కోటి రూపాయలు కత్తిరించుకుంటే తప్ప.. అవకాశాలు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. బాలీవుడ్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా కిసీకా భాయ్ కిసిక జాన్ సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే. ఈ రెండు పెద్ద సినిమాలు తప్ప ఈమె చేతిలో మరే ప్రాజెక్టు లేదు. ఇలాంటి సమయంలో నాకు ఇంత కావాలి అంత కావాలి అంటూ నిర్మాతల దగ్గర గొప్పలకు పోతే వచ్చే అవకాశాలు కూడా రావు. దాంతో కచ్చితంగా పారితోషకం కత్తిరించుకోవడం తప్ప పూజ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు.