తల్లి కావాలని కలలు కన్నాను.. కానీ : సమంత తాజా కామెంట్స్ వైరల్

సిటాడెల్ టీమ్ అంతా కలిసి భారీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రమోషన్‌లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

samantha naga chaitanya
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, టాలీవుడ్ : చాలా రోజుల గ్యాప్ తర్వాత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. ఆ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా లిప్ కిస్ అయితే సిరీస్ మొత్తానికి హాట్ టాపిక్‌గా నిలిచింది. వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కుతుండటంతో సమంత జోష్‌లో మునిగి తేలుతోంది. ఇందులో భాగంగా సిటాడెల్ టీమ్ అంతా కలిసి భారీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రమోషన్‌లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తల్లి కావాలని కలలు కనేదాన్ని. అదో పరిపూర్ణమైన అనుభూతి. మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావించా. మాతృత్వానికి వయసు ఎప్పటికీ అడ్డు కాదు. జీవితంలో ఏ దశలోనైనా అదొక అద్భుతమైన ప్రయాణం’ అని వెల్లడించింది.

దీంతో ప్రస్తుతం సమంత కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్‌గా ఉన్న సమంత.. తాజాగా ఇలా మాతృత్వంపై మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని.. జీవితంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నేర్చుకున్నానని తెలిపింది. ‘జీవితంలో ప్రస్తుతం చాలా పాజిటివ్ దశలో ఉన్నా. దేనికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలో నేర్చుకున్నా. సెల్ఫ్ కేర్ ముఖ్యమని గ్రహించా. నా జీవితానికి ఏది అవసరమో తెలుసుకున్నా’ అని వివరించింది. కాగా, మూడేళ్లపాటు కాపురం చేసిన నాగచైతన్య, సమంత.. పిల్లలు పుట్టకముందే విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య.. శోభ ధూళిపాళ్లతో పెళ్లికి రెడీ కాగా, సమంత మాత్రం సింగిల్‌గానే ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్