సీక్వెల్ ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. బ్రాండ్ సరిగ్గా వాడుకుంటే ఓకే గానీ లేదంటే అంతే సంగతులు. లూసీఫర్ 2 కూడా అంతే..
ప్రతీకాత్మక చిత్రం
సీక్వెల్ ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. బ్రాండ్ సరిగ్గా వాడుకుంటే ఓకే గానీ లేదంటే అంతే సంగతులు. లూసీఫర్ 2 కూడా అంతే.. పూర్తిగా బ్రాండ్‌ను నమ్ముకుని వచ్చిన సినిమా. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైప్ మైండ్‌లో పెట్టుకుంటే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా జస్ట్ మోహన్ లాల్ ర్యాంపేజ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఓకే.. లూసీఫర్ పూర్తిగా మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవల్. సెకండ్ పార్ట్ అలా కాదు.. మొత్తం ఎలివేషన్స్ మీదే వెళ్లిపోతుంది. మొదటి అరగంట అద్భుతంగా మొదలైంది, కానీ ఆ తర్వాత నెమ్మదిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత గానీ మోహన్ లాల్ ఎంట్రీ ఉండదు. స్క్రీన్ మీద హీరో లేకపోయినా, ఆయన ప్రజెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. లూసీఫర్ అంతా పొలిటికల్ డ్రామా. ఇందులో పాలిటిక్స్ తక్కువ, ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. కథ కూడా చాలా మలుపులు తీసుకుంటుంది.
అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ సీన్స్ పడ్డాయి కానీ అవి సరిపోలేదు. కీలకమైన సెకండాఫ్ కూడా మనం ఊహించిన దానికంటే తక్కువగానే అనిపిస్తుంది. ఈసారి పాలిటిక్స్ కంటే రివేంజ్ డ్రామాపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మోహన్ లాల్ మరోసారి అదరగొట్టాడు. అబ్రహాం ఖురేషీగా స్క్రీన్‌ను షేక్ చేసాడు. పృథ్వీరాజ్ కనిపించేది కాసేపే అయినా బాగున్నాడు. టొవినో థామస్ ఓ కీలక పాత్రలో మెప్పించాడు. మంజు వారియర్ మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మాయ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈసారి దర్శకుడిగా అంతగా మెప్పించలేదు.
ఓవరాల్‌గా లూసీఫర్ 2 ఎంపురాన్ అంచనాలు లేకుండా వెళ్తే జస్ట్ ఓకే..!
సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు