ప్రేక్షకులను అలరించిన గుంటి పిచ్చయ్య రికార్డింగ్ డాన్స్

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన ప్రముఖ రంగస్థలం నటుడు, విద్యుత్తు శాఖ అధికారి డాక్టర్ గుంటి పిచ్చయ్య.. జస్టిస్ చౌదరి చిత్రంలో నందమూరి తారక రామారావు నటించిన"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ పోరాటంలో " అనే పాటకు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

gunti pichaiah
గుంటి పిచ్చయ్య రికార్డింగ్ డ్యాన్స్

(ఈవార్తలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి- అక్కినేపల్లి పురుషోత్తమరావు)

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన ప్రముఖ రంగస్థలం నటుడు, విద్యుత్తు శాఖ అధికారి డాక్టర్ గుంటి పిచ్చయ్య.. జస్టిస్ చౌదరి చిత్రంలో నందమూరి తారక రామారావు నటించిన"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ పోరాటంలో " అనే పాటకు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సంతోష్ ఆర్ట్స్ సమీర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్సీ శాస్త్రి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఎలివెంట్స్ ఎలైట్ స్టూడియో వాసవి శ్రీముఖి కాంప్లెక్స్ హిమాయత్ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్ జైహింద్  తో పాటు దీప్తి జగన్నాథశాస్త్రి ఎన్ రాఘవేంద్ర శాస్త్రి, వి వెంకట్రావు, శ్రీ శ్రీనివాస కళావేదిక అధ్యక్షులు బావనాసి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ యువజన నాయకులు వంశీకృష్ణ, మల్లెపూల వెంకటరమణ, ఎలివెంట్ ఎలైట్ స్టూడియో ప్రధాన కార్యదర్శి కామేష్, సమీర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

వెబ్ స్టోరీస్