Film Fare Awards : ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్.. ఉత్తమ నటులు ఎవరంటే..

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ నిలిచింది. సీతారామం సినిమాలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

mrunal thakur

మృణాల్ ఠాకూర్ Photo: Instagram

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ నిలిచింది. సీతారామం సినిమాలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. అటు.. ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఆ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటులుగా రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి ఉత్తమ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. ఉత్తమ చిత్రంగా సీతారామం నిలవగా, తెలుగు కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నిలిచింది.

తెలుగు కేటగిరీ:

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి) 

ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్

ఉత్తమ నటులు - రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)

ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతారామం)

ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)

ఉత్తమ డైరెక్టర్ - రాజమౌళి (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ కొరియోగ్రాఫర్ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు పాట)

ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుపాటి (బీమ్లా నాయక్)

ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాటపర్వం)

ఉత్తమ మ్యూజిక్ అల్బం - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్