Lucky Bhaskar Movie Review | లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ..

సినిమా అదిరిపోయిందిరా.. భలే తీసార్రా..! ఓ సినిమా లవర్‌గా ఈ మాట రాయడానికి నేను చాలా ఇష్టపడతా..! కానీ ఈ మాట చెప్పే ఛాన్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ రూపంలో ఆ అవకాశం వచ్చింది.

lucky bhaskar

ప్రతీకాత్మక చిత్రం

సినిమా అదిరిపోయిందిరా.. భలే తీసార్రా..! ఓ సినిమా లవర్‌గా ఈ మాట రాయడానికి నేను చాలా ఇష్టపడతా..! కానీ ఈ మాట చెప్పే ఛాన్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ రూపంలో ఆ అవకాశం వచ్చింది. సినిమా అదిరిపోయింది.. నిజంగా అదిరిపోయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్‌కు ఫిదా అయిపోయాను నేను. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా.. కట్టి పడేసే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బలమున్నోన్ని కొట్టొచ్చు కానీ తెలివైనోన్ని కొట్టలేం అనేది లక్కీ భాస్కర్ లైన్. బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కామ్స్‌ను తెలివిగా వాడుకుని ఓ సామాన్యుడు అసామాన్యుడుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఒక్కో సీన్‌ను వెంకీ అట్లూరి డిజైన్ చేసిన తీరు అద్భుతంగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా మొదటి అరగంట కామన్ మ్యాన్ కష్టాలు బాగా ఎస్టాబ్లిష్ చేసాడు. హీరో డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత అదేదో మనకే డబ్బు వస్తున్నట్లు కథలో లీనమైపోతాం.

హీరో కంగారు పడితే మనం కంగారు పడతాం.. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం. హీరో ఎక్కడ దొరికిపోతాడో అని మనం కూడా టెన్షన్ పడుతుంటాం. అన్ని సినిమాలకు ఇలాంటి మ్యాజిక్ అయితే జరగదు. లక్కీ భాస్కర్ విషయంలో అన్నీ అలా కలిసొచ్చాయంతే. దుల్కర్ సల్మాన్ మరోసారి అదరగొట్టాడు.. ఆయన నటన గురించి ఏం చెప్పాలి..? మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటించింది. స్కామ్ 1992 ఛాయలు కనపించినా తన రైటింగ్‌తో స్క్రీన్ మీద పెద్ద మ్యాజిక్ చేసాడు వెంకీ అట్లూరి.

ఓవరాల్‌గా లక్కీ భాస్కర్.. వెల్ ప్లేడ్.. ష్యూర్ షాట్ విన్నర్.. Just Go for It..

సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్