ఐఏఎస్ అధికారికి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. సినిమాలు తీయడమే కష్టమంటూ వ్యాఖ్య

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఐఏఎస్ అధికారి గతంలో దర్శకులు గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో యానిమల్ చిత్రాన్ని ఉద్దేశించి ఒక మాజీ ఐఏఎస్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తాజాగా స్పందించారు. కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావచ్చు అని.. కానీ ఫిల్మ్ మేకర్ కావాలంటే ఎలాంటి కోర్సులు లేవన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యానిమల్ పై చేసిన వ్యాఖ్యలు తనకి ఇంకా గుర్తున్నాయన్నారు. ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయమని పేర్కొన్నారు.

Sandeep Reddy Wanga

డైరెక్టర్ సందీప్ రెడ్డి

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఐఏఎస్ అధికారి గతంలో దర్శకులు గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో యానిమల్ చిత్రాన్ని ఉద్దేశించి ఒక మాజీ ఐఏఎస్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు తాజాగా స్పందించారు. కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావచ్చు అని.. కానీ ఫిల్మ్ మేకర్ కావాలంటే ఎలాంటి కోర్సులు లేవన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యానిమల్ పై చేసిన వ్యాఖ్యలు తనకి ఇంకా గుర్తున్నాయన్నారు. ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయమని పేర్కొన్నారు. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకు వెళ్లిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా తనను ఎంతో బాధించాయని పేర్కొన్న సందీప్ రెడ్డి.. తాను ఏదో నేరం చేశాననిపించిందని బాధపడ్డారు. ఆయన అనవసరంగా తన సినిమా గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారని పెంచిందని పేర్కొన్నారు. తనకు ఆ వ్యాఖ్యలపై కోపం కూడా వచ్చిందని వివరించారు.

ఆ సమయంలో తాను ఒక్కటే అర్థం చేసుకున్నానని, ఐఏఎస్ అధికారి కావాలంటే ఢిల్లీకి వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే చాలు అన్నారు. అదే ఫిల్మ్ మేకర్ లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరన్నారు. నీకు నువ్వుగా అన్ని నేర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధితోనే ముందుకు సాగాలని, ఇదే విషయాన్ని కావాలంటే తాను పేపర్ పై కూడా రాసి ఇస్తాను అని సందీప్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ప్రభాస్ తో తెర్కెక్కిస్తున్న స్పిరిట్ గురించి సందీప్ మాట్లాడారు. మా సినిమా బాహుబలిని దాటాలంటే 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని, అది చాలా పెద్ద విషయం అన్నారు. ఎప్పటికైతే తాను మంచి సినిమా చేస్తానని, అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చెప్పలేనన్నారు. 12 th ఫెయిల్ లో యూపీఎస్సీ ప్రొఫెసర్ గా నటించిన మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్య కీర్తి ఆ సినిమా విడుదలైన సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సమాజానికి ఎలాంటి సందేశాత్మక చిత్రాలు అవసరమన్నారు. అనంతరం ఆయన యానిమల్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం పట్ల తాజాగా సందీప్ రెడ్డి వంగ స్పందించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్