||మంచు ఫ్యామిలీలో గొడవలు||
ఈవార్తలు, సినిమా వార్తలు: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఓ సంచలన వీడియోను మంచు మనోజ్ బయటపెట్టాడు. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ గుసగుసలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్‌ను నిజం చేస్తున్నట్టే.. తన అన్నతో విభేదాలు ఉన్నాయంటూ స్వయంగా మనోజ్ ఓ దాడి వీడియోను బహిర్గతం చేశాడు. తన అనుచరులపై విష్ణు దాడి చేశాడంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో సంచలనం రేపుతోంది. ఇంట్లోకి చొరబడ్డ విష్ణు.. తన సన్నిహితుడైన సారథితో వివాదానికి దిగడమే కాదు.. అతడిపై దాడి చేశాడంటూ మనోజ్ వీడియో విడుదల చేశాడు. ‘ఇదీ పరిస్థితి.. కొంతకాలంగా మా అన్న విష్ణు వ్యవహారం ఇలా ఉంది’ అని మనోజ్ పేర్కొన్నాడు.