హీరో చియాన్ విక్రమ్‌కు తీవ్ర గాయాలు.. ప్రమాదంలో విరిగిన పక్కటెముక

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||చియాన్ విక్రమ్ Photo: twitter||

ఈవార్తలు, సినిమా న్యూస్: విలక్షణ క్యారెక్టర్లతో సినీ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సినీనటుడు, హీరో చియాన్ విక్రమ్ పక్కటెముక విరిగింది. చెన్నైలో తంగలాన్ సినిమా షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఆపరేషన్ అవసరమని వైద్యులు వెల్లడించారు. ఇన్ని రోజులు పొన్నియన్ సెల్వన్-2 ప్రచారంలో బిజీగా ఉన్న విక్రమ్.. నిన్నటి నుంచే తంగలాన్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సినిమా తమిళ్ అడ్వెంచర్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిగిలిన పార్టును మరో రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేయాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. దీంతో సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాను 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, షెడ్యూల్ ఆలస్యమయ్యేలా ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్