ఆ యంగ్ హీరోపై ఆశలు పెట్టుకున్న చిరంజీవి కూతురు..!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||శ్రీదేవి శోభన్ బాబు సినిమా||

మెగా ఫ్యామిలీలో హీరోలకే కాదు నిర్మాతలకు కూడా కొదవలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టారు. అప్పట్లో కేవలం నాగబాబు మాత్రమే అంజనా ప్రొడక్షన్స్ లో సినిమాలు తీశాడు. దానికి ముందే అల్లు అరవింద్ కూడా గీత ఆర్ట్స్ పెట్టి చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేశాడు. ఇప్పుడు కొడుకు అల్లు అర్జున్, అల్లుడు రామ్ చరణ్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. దానికి తోడు రామ్ చరణ్ కూడా సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టాడు. అందులో చిరంజీవి హీరోగా వరస సినిమాలు నిర్మిస్తున్నాడు మెగా వారసుడు. ఇప్పుడు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది. 

అందులో మొదటి ప్రయత్నంగా శ్రీదేవి శోభన్ బాబు సినిమా నిర్మించింది. సంతోష్ శోభన్ ఇందులో హీరోగా నటించాడు. ప్రశాంత్ కుమార్ దిమ్మల అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించింది సుస్మిత. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. నిర్మాతగా మొదటి సినిమాతో కచ్చితంగా విజయం అందుకుంటాను అని నమ్మకంగా చెప్పింది. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుందని ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతుంది మెగా డాటర్. ఈ సినిమా విజయం కేవలం సుస్మితకు మాత్రమే కాదు.. సంతోష్ శోభన్ కెరీర్ కు కూడా అత్యంత కీలకంగా మారింది. 

ఎందుకంటే ఇప్పటివరకు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకుండా ముందుకు వెళ్తున్నాడు సంతోష్. ఇకపై అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా శ్రీదేవి శోభన్ బాబు హిట్ కావాల్సిందే.. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. ఇది ఆడితేనే సంతోష్ శోభన్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే కెరీర్ అనుకున్నట్లుగా సాగడం కష్టం. ఇప్పటికే లైక్ షేర్ సబ్స్క్రయిబ్, కళ్యాణం కమనీయం సినిమాలతో వరుస డిజాస్టర్స్ ఇచ్చాడు ఈ హీరో. ఇలాంటి సమయంలో వస్తున్న శ్రీదేవి శోభన్ బాబు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

దానికి తోడు ఫిబ్రవరి 17న ధనుష్ సార్ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత రోజు గీతా ఆర్ట్స్ నిర్మించిన కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ వస్తోంది. ఈ రెండు సినిమాలను తట్టుకొని మెగా డాటర్ సినిమా నిలబడాలంటే కచ్చితంగా కథ చాలా బలంగా ఉండాలి. ఏ చిన్న తేడా జరిగినా కూడా చిరంజీవి కూతురుకు నిరాశ తప్పదు. మరి చూడాలి.. ఈ యంగ్ హీరోతో మెగా డాటర్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో..!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్