Pathan Movie : పఠాన్ సినిమాపై వరుస విమర్శలు.. బాలీవుడ్‌కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శాపమా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(చిత్రం: పఠాన్ సినిమాలోని సన్నివేశం. చిత్రంలో దీపిక పదుకొణె, షారుక్ ఖాన్)

ఈవార్తలు, బాలీవుడ్ న్యూస్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన సినిమా పఠాన్ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఆ సినిమాలోని భేషరంగ్ పాటలో హీరోయిన్ కాషాయ రంగు బికినీ ధరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ప్రస్తుతం సినిమా వాళ్లను ఎవరిని తట్టినా పఠాన్ పేరే వినిపిస్తోంది. ఒక విధంగా ఈ వివాదాస్పద నిర్ణయాలు ఆ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. ప్రమోషన్ కంటే ఎక్కువ స్థాయిలో ప్రచారం దక్కుతుండటంతో సినీ నిర్మాత, డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఎంజాయ్ చేస్తున్నారు. బికినీ రంగు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదనేది కొందరి వాదన. దానితోనే సినిమాను బాయ్‌కాట్ చేయాలని ఆయా వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఏదేమైనా సినిమా విడుదలయ్యే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

అటు.. ఒక్క పఠాన్ సినిమానే కాదు.. బాలీవుడ్‌లో అన్ని సినిమాల బాయ్‌కాట్ నడుస్తున్నది. గత రెండేండ్లుగా చూస్తే బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ హిట్ అందుకున్న సినిమానే లేదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మోస్తరుగా నడిచినా, చాలా సినిమాలు తమ ఉనికిని కోల్పోయాయి. ఒకానొక సందర్భంగా బాలీవుడ్ డైరెక్టర్ల వద్ద కథలన్నీ అయిపోయానని, అందుకే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ సినిమాలు నడుస్తున్నాయని సినీ క్రిటిక్స్ బహిరంగంగానే విమర్శించారు. వారు అన్నట్టుగానే బాహుబలి2, కేజీఎఫ్, పుష్ప, కార్తికేయ2 లాంటి సినిమాలు చాలా బాగా ఆడాయి.

అయితే, బాలీవుడ్ బాయ్‌కాట్‌కు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు సంబంధం ఉందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ చనిపోయిన తర్వాతే ఈ బాలీవుడ్ బాయ్‌కాట్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ప్రతి సినిమా ఫ్లాప్‌ ట్యాగ్‌ను పెట్టుకున్నవే. కొందరైతే.. బాలీవుడ్‌కు సుశాంత్ శాపం తగిలిందని, స్టార్ హీరోలు, వారి కిడ్స్ సుశాంత్‌ను తక్కువ చేసి చూశారని, కొందరైతే ఏకంగా నిందించారని కోడై కూస్తున్నారు. ఏదో ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అనుకోవచ్చు కానీ, అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే కచ్చితంగా సుశాంత్ బాధ వల్ల వచ్చిన శాపమేనని అంటున్నారు. ఏదేమైనా ఈ బాలీవుడ్ బాయ్‌కాట్ ఎప్పుడు ముగుస్తుందో? ఎప్పుడు ఆ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయో? చూడాలి.





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్