బిగ్ బాస్ 6 అప్డేట్స్ వచ్చేశాయ్.. అయితే ఈసారి డిఫరెంట్ గా ఉండబోతుందట..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారా... బిగ్ బాస్ 6 అప్డేట్స్ వచ్చేశాయ్.. దీనికి సంబంధించిన లోగో వీడియో బిగ్ బాస్ నిర్వహకులు రిలీజ్ చేశారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ షో మొదలవుతుందని సమాచారం. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.

కానీ #BBLiveOnHotstar అనే ట్యాగ్ ను జోడించింది. అంటే ఈ షోని కూడా 24 గంటల పాటు హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉంది.అలా లైవ్ రన్ చేస్తూనే టీవీలో గంట సేపు ఎపిసోడ్స్ ను ప్రసారం చేస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ రానుంది. ఇక ఈ షో లో 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్