భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వరుసగా సీరియస్ యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. రవితేజ మార్క్ కామెడీని, ఆ టైమింగ్ ను ఫ్యాన్స్ గట్టిగా మిస్ అవుతున్నారు.

bharath mahasayulu vignapthi

భర్త మహాశయులకు విజ్ఞప్తి 

మాస్ మహారాజా రవితేజ అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వరుసగా సీరియస్ యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. రవితేజ మార్క్ కామెడీని, ఆ టైమింగ్ ను ఫ్యాన్స్ గట్టిగా మిస్ అవుతున్నారు. ఆ లోటు తీర్చడానికే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ వస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే బజ్ పెరుగుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరో మెట్టు ఎక్కించి, వినోదాల విందు ఖాయం అనిపించేలా ఉంది. టీజర్ స్టార్టింగ్ నుంచే రవితేజ తనదైన స్టైల్ లో నవ్వులు పూయించారు. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా, కాస్త కొంటెగా ఉంది. ఒకవైపు "నా భార్య అంటే నాకు ప్రాణం" అని అమాయకంగా చెబుతూనే, మరోవైపు బయట వ్యవహారాలు నడిపే చిలిపి భర్తగా రవితేజ చేసే రచ్చ మామూలుగా లేదు. "ఎవరైతే తప్పు చేసి.. ఆ తప్పు భార్యకు తెలిస్తే ఆమె బాధపడుతుందని భయపడతాడో.. వాడే అసలు సిసలైన మొగుడు" అనే ఫిలాసఫీ నవ్వులు తెప్పిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత రవితేజలో ఆ పాత కామెడీ టైమింగ్ మళ్ళీ కనిపిస్తోంది. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా, పక్కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఇక రిలీజ్ తరువాత జనాలు ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారో చూడాలి.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్