కాశీలో బాలయ్య దర్శనం

వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ‘అఖండ 2’ చిత్రానికి వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో చిత్రయూనిట్‌తో కలిసి బాలయ్య ఆధ్యాత్మిక నగరమైన కాశీకి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

balakrishna

బాలయ్య 

వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ‘అఖండ 2’ చిత్రానికి వస్తున్న అపూర్వ స్పందన నేపథ్యంలో చిత్రయూనిట్‌తో కలిసి బాలయ్య ఆధ్యాత్మిక నగరమైన కాశీకి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నేటి తరం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ‘అఖండ 2’ సినిమాలో తాను సనాతన సైనికుడిగా నటించానని, ఆ పాత్ర తనకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చిందని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నిర్మాతలు, దర్శకుడు కలిసి కలసి సినిమా గురించి వివరించారని బాలయ్య పేర్కొన్నారు. సినిమా సందేశం, సనాతన ధర్మంపై ఉన్న అంశాలు ఆయనను ఆకట్టుకున్నాయని చెప్పారు.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్