Pushpa 2 | భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్ రికార్డు.. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ 270 కోట్లు..!

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా వస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప-1 చిత్రం భారీ విజయం సాధించడంతో రెండో పార్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

allu arjun

అల్లు అర్జున్

ఈవార్తలు, ముంబై : అల్లు అర్జున్ Allu Arjun, రష్మిక మందన్నా Rashmika Mandanna జంటగా వస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప-1 చిత్రం భారీ విజయం సాధించడంతో రెండో పార్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే డిజిటల్ హక్కుల ద్వారా భారీగా వసూలు చేస్తున్న ఈ సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్లలో దూసుకుపోయే అవకాశం ఉందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించబోతోందని పేర్కొంటున్నారు. ఓపెనింగ్ డే  రోజున.. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్లు రూ.270 కోట్లు దాటే అవకాశం ఉందని జోస్యం చెప్తున్నారు.

sacnilk.com ప్రకారం సినిమా విడుదలైన తొలి రోజున.. ఏపీ, తెలంగాణలో రూ.85 కోట్లు, కర్ణాటకలో రూ.20 కోట్లు, తమిళనాడులో రూ.12 కోట్లు, కేరళలో రూ.8 కోట్లు, దేశంలోని మిగతా చోట్ల రూ.75 కోట్లు సాధిస్తుందట. ఓవర్సీస్ మార్కెట్‌లో తొలి రోజే రూ.70 కోట్లు రాబడుతుందట. మొత్తంగా చూస్తే పుష్ప 2 తొల రోజే 270 కోట్లు దాటిపోతుందని వివరాలతో సహా వెల్లడించింది. డిసెంబర్ 5వ తేదీన సినిమా విడుదల కానుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో.. మిగతా సినిమా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. పుష్ప 2 విడుదల సమయంలో తమ సినిమాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

పుష్ప 2 సినిమా విశేషాలు:

విడుదల తేది : డిసెంబర్ 5, 2024

డైరెక్టర్ : సుకుమార్

మ్యూజిక్ డైరెక్టర్ : దేవీశ్రీ ప్రసాద్ 

బడ్జెట్ రూ.400 కోట్లు-రూ.500 కోట్లు

నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్

డిస్ట్రిబ్యూటర్ : ఏఏ ఫిల్మ్స్, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, ప్రియమణి, శ్రీలీల, సునీల్ తదితరులు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్