Pranita | రెండో సారి గర్భం దాల్చిన సినీనటి ప్రణీత సుభాష్

సినీ నటి ప్రణీత రెండోసారి గర్భం దాల్చింది. ఈ మేరకు రౌండ్ 2.. ఇక నుంచి ప్యాంట్ సరిపోదు అని కామెంట్ చేస్తూ పోస్ట్ చేసింది.

pranita
ప్రణీత రెండో సారి ప్రెగ్నెంట్

సినీ నటి ప్రణీత రెండోసారి గర్భం దాల్చింది. ఈ మేరకు రౌండ్ 2.. ఇక నుంచి ప్యాంట్ సరిపోదు అని కామెంట్ చేస్తూ.. బ్లాక్ టాప్, జీన్స్ వేసుకొని ఉన్న ఫొటోను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే ఒక బిడ్డను కన్న ప్రణీత దంపతులు.. ఇప్పుడు మరొకరి కోసం సిద్ధమయ్యారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి చేసుకున్న ప్రణీత.. 222 జూన్ 10న ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో బావ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురూ ప్రేమకోసమే సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్