ఆ హీరో అంటే నాకు క్రష్.. అతడికి పెళ్లైతే నా గుండె పగిలిపోయింది: నటి మీనా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నటి మీనా Photo: Twitter||


చైల్డ్ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు హీరోయిన్ మీనా.  తమ కెరియర్ ప్రారంభమై 40 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా 'మీనా 40' పేరుతో చైన్నై లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి  మాట్లాడుతూ.. తన క్రష్ అయినా నటుడికి పెళ్లి అయిందని విన్న తర్వాత తన గుండె ముక్కలు అయిందని, చాలా బాధపడ్డాను అంటూ మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. మీనాకు పెళ్లి కాకముందు హృతిక్ రోషన్ లాంటి భర్త రావాలని కోరుకుందట, అయితే.. ఆయనకు పెళ్లి  కావడంతో గుండె పగిలిందంటూ బాధను వ్యక్తం చేశారు. 

కాగా, మీనాకి బెంగళూరులో సాఫ్ వేర్ ఉద్యోగి అయిన విద్యాసాగర్ తో 2009 లో వివాహం జరిగింది. కానీ తమ జీవితం మొదలైన 13 సంవత్సరాలకే భర్త ఊపిరితిత్తుల సమస్యతో మరణించాడు. కొన్ని రోజులుగా మీనా మీడియాకు దూరంగా ఉంది. అయితే చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆమె ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ తన భర్త జ్ఞాపకాల నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడలలో 68 పైగా సినిమాలో నటించింది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్