Flipkart - Hero Bikes | ఫ్లిప్‌కార్ట్‌లో హీరో బైక్ బుకింగ్ ఆప్షన్.. ఈఎంఐ తదితర సదుపాయాలు కూడా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ హీరో కంపెనీ ద్విచక్ర వాహనాల బుకింగ్‌ను ప్రారంభించింది. హీరో కంపెనీకి చెందిన హీరో స్ల్పెండర్ ప్లస్, ప్యాషన్ ప్లస్, సూపర్ స్ల్పెండర్, ప్లీజర్, మ్యాస్ట్రో, డెస్టినీ, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్ తదితర బైక్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టింది. వాహనం బుక్ చేసుకున్న 15 రోజుల్లో బైక్ ఇంటికి చేరుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. బైక్ వద్దనుకుంటే ఎలాంటి చార్జీలు లేకుండానే మొత్తం రీఫండ్ చేయనుంది. అయితే, ఆర్టీఏ డాక్యుమెంట్లు సమర్పించే వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టిన బైక్‌లు ఎక్స్‌షో రూం ధర మాత్రమేనని, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ తదితర చార్జీలు ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలోని డీలర్ చెప్తారని, మిగతా సొమ్ము అక్కడ చెల్లించాలని స్పష్టం చేసింది. బైక్స్ కొనుగోళ్లకు ఫ్లిప్‌కార్ట్ ఈఎంఐ, ఇతర ఆఫర్లను అందిస్తోంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కూడా చెల్లించొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో బైక్ బుక్ చేసుకోవడం ఇలా..

  • డే 1 : అవసరం ఉన్న బైక్‌ను ఎక్స్ షోరూం ధర చెల్లించాలి.
  • డే 2 - డే 7: ఫ్లిప్‌కార్ట్ హీరో కంపెనీకి చెందిన డీలర్లతో అనుసంధానం చేస్తుంది. ఇన్సూరెన్స్, ఆర్టీవో చార్జీలు, కేవైసీ డాక్యుమెంట్ల సేకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
  • డే 8 - డే 12 : ఆర్టీవో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా బ్రాండ్ ఆథరైజ్డ్ డీలరే చూసుకుంటారు.
  • డే 13 - డే 15 : డీలర్ వద్ద నుంచి బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.

వెబ్ స్టోరీస్