పండుగ సీజన్లు వచ్చాయంటే చాలు.. నో కాస్ట్ ఈఎంఐ అంటూ అనేక బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్లు.. ఇలా నో కాస్ట్ ఈఎంఐలో తీసుకోవాలని చెప్తుంటాయి. ఇది సాధారణ ఈఎంఐ కంటే భిన్నం.
ప్రతీకాత్మక చిత్రం
బిజినెస్ న్యూస్, ఈవార్తలు: పండుగ సీజన్లు వచ్చాయంటే చాలు.. నో కాస్ట్ ఈఎంఐ అంటూ అనేక బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్లు.. ఇలా నో కాస్ట్ ఈఎంఐలో తీసుకోవాలని చెప్తుంటాయి. ఇది సాధారణ ఈఎంఐ కంటే భిన్నం. వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు.. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఇస్తుంటాయి. అంటే.. ఈఎంఐలకు ఎలాంటి వడ్డీ చెల్లించే అవసరం లేదనేది వీటి ఉద్దేశం. అసలు.. నో కాస్ట్ ఈఎంఐలతో లాభాలేంటి? వాటి వల్ల వినియోగదారులకు కలిసొచ్చే ప్రయోజనాలేంటి? వడ్డీ లేకుండా ఇస్తే బ్యాంకులకు లాభాలేంటి? అంటే.. నో కాస్ట్ ఈఎంఐలో వినియోగదారుల నుంచి వడ్డీ వసూలు చేయరు. కానీ.. ఇలాంటి వాటి వల్ల వినియోగదారులకు నష్టమే.
ఈ సదుపాయం బ్యాంకులకు, రిటైల్ వ్యాపారులకు లాభం చేకూరుస్తుంది. వారి బిజినెస్ పెరగడమే కాకుండా.. ప్రతి నెల స్థిరమైన ఆదాయం అందుతుంది. చిల్లర వ్యాపారులకు అమ్మకాలు పెరుగుతాయి. కస్టమర్లు అయితే.. ఒకే సారి ఎక్కువ డబ్బు పెట్టనవసరం లేదు. ఖరీదైన వస్తువులను వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు. కానీ.. నో కాస్ట్ ఈఎంఐ వల్ల డిస్కౌంట్ దక్కదు. రిటైలర్‌కు పూర్తి ధర చెల్లించే వస్తువును కొంటాం. అదే.. ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించి కొంటే డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డిస్కౌంట్ నో కాస్ట్ ఈఎంఐలో లభించదు.