Gold Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..కొనేందుకు ఇదే మంచి ఛాన్స్

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.

GOLD PRICE
ప్రతీకాత్మక చిత్రం 

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి నేలచూపు చూశాయి. నిన్న ఒక్కరోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ సెషన్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.తాజాగా మరింత తగ్గాయి. 

సోమవారంతో పోల్చితే ఈ రోజు బంగారం ధర దిగివచ్చింది. నేడు తులానికి 800రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,900లకు చేరుకుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ. 69,710కి చేరింది. గత నెలలో 75వేల మార్క్ ను టచ్ చేసిన బంగారం ధర ఇప్పుు 70వేల మార్క్ కు దిగిరావడం విశేషం. ఈ ధరలు పసిడి ప్రియులను బాగా ఆకర్షిస్తున్నాయి. 

ఇక వెండి ధరలు కూడా బంగారంతోపాటు తగ్గుతున్నాయి. ఈ ఒక్కరోజు వెండి ధరల్లో మార్పు కనిపించింది. వెండి ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. ఏకంగా 3500 రూపాయలకు దిగివచ్చింది. ప్రస్తుతం 87వేల 500కు చేరింది.ఇక బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్