దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నమోదు అయిన వివరాలను ప్రకారం చూస్తే..పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నమోదు అయిన వివరాలను ప్రకారం చూస్తే..పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 93 వేల వద్ద ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వెండి, బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ లలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 66,950గా ఉంది. పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,100గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,190గా ఉంది. ముంబై, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 66,950గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,040గా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఆదివారం వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఉదయం నమోదు అయిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి రూ. 93,000వద్ద కొనసాగుతోంది.