నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు నిరాశే ఎదురైంది. బంగారం ధర ఏకంగా 800 పెరిగింది. దీంతో బంగారం ధర మరోసారి 70వేలకు చేరుకుంది.
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియుల్లో నిరాశ ఎదురవుతోంది. నేడు ఆగస్టు 11 వ తేదీ ఆదివారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 70,100కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 64, 260కి చేరుకుంది. శనివారంతో పోల్చితే బంగారం ధర ఏకంగా రూ. 800 పెరిగింది. గడిచిన మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం వెండి ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పుల కారణంగా ధరలు పెరుగుతున్నాయి బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కాగా గత వారంరోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఇప్పుడు బంగారం ధర కనిష్ట స్థాయి నుంచి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రస్తుతం బంగారం ధర మరోసారి 70వేలు దాటింది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో బంగారం ధరలు వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్ తోపాటు శుభముహూర్తాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ మాసంలో బంగారం, వెండి కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగడంతో బంగారం ప్రియుల్లో ఆందోళన నెలకొంది.