దేశవ్యాప్తంగా నేడు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 17న భారీగా పెరిగిన బంగారం ధర ఆతర్వాత స్థిరంగా ఉంటూ వచ్చింది. నేడు బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ తోపాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, పొద్దుటూరులలో కూడా బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 , 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ100 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 66,660గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 72,650 పలుకుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోలకత్తా, ముంబై, కేరళలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. మొన్న వరకు భారీగా పెరిగిన వెండి ధర ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ పెరుగుతూనే ఉంది. దీంతో వెండి ధర మళ్లీ గరిష్టానికి చేరింది. ఈరోజు కిలో వెండి ధర రూ. 1000 పెరిగి, రూ. 87,000 వద్ద ఉంది. ఇవే ధరలు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా నమోదు అయ్యాయి.