మోమోస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం. చిన్న ట్రాలీతో వ్యాపారం మొదలు పెట్టి నేడు రూ. 2వేల కోట్ల ఆదాయం అర్జిస్తున్న వావ్ మోమూ వ్యవస్థాపకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
మోమోస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారం. ఓ కంపెనీని సృష్టించి ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు.మోమోస్ భారతదేశం అంతటా అత్యంత ప్రజాదరణ పొందిన, స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడే ఆహారాల్లో ఒకటి. మోమోలను చాలా మందికి ఇష్టం. దీన్నే వ్యాపారంగా మలచుకున్నాడు సాగర్ దర్యాన్నీ . వావ్ మోమో అనే కంపెనీని స్థాపించాడు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు దర్యాని తన క్లాస్‌మేట్ బినోద్ హోమకైతో కలిసి ఆగస్టు 29, 2008న వావ్ మోమోను స్థాపించాడు.
కోల్‌కతాలో చిన్న పుష్కరాలతో మోమోస్ దుకాణాన్ని ప్రారంభించి తమ సింపుల్ ఐడియాతో దాన్ని విజయవంతమైన వ్యాపారంగా మార్చారు. ఈ వ్యాపారం గురించి తన కుటుంబంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా కూడా వెనకడుగు వేయలేదు. 21ఏండ్ల వయస్సులోనే దర్యాణీ గొప్ప వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నాడు. మొదట ఒక చిన్నటేబుల్ రెండు కుర్చీలు, పార్ట్ టైమ్ కుక్ లతో 30వేలు ఖర్చు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఇప్పుడు 2వేల కోట్లకు ఎదిగింది.
కస్టమర్లను ఆకర్షించడానికి వావ్ మోమో అనే దాని ప్రత్యేక పేరు పెట్టారు. ఆహారంలో వినూత్న ప్రయోగాలు చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. వ్యాపారం మొదలుపెట్టిన ప్రారంభ రోజుల్లో కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వారి నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి వారు. వారికి నచ్చినట్లుగా ఫుడ్ రెడీ చేసేవారు. ఇలా చిన్న ట్రాలీతో మొదలైన వ్యాపారం నేడు కోట్ల రూపాయలు ఆర్జీస్తోంది. ప్రస్తుతం కంపెనీ దాదాపు 250 స్టోర్లను కలిగి ఉంది. త్వరలో దీన్ని 350కి పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు దర్యాణీ చెప్పారు.