భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఒక్క రోజులోనే 12 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. చైనాలో బయటపడ్డ మరో వైరస్ హెచ్ఎంపీవీ HMPV Virus వైరస్ కేసులు.. ఇండియాలో నమోదు కావటంతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు భయం పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది.

stock markets china virus

ప్రతీకాత్మక చిత్రం

ముంబై, ఈవార్తలు : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. చైనాలో బయటపడ్డ మరో వైరస్ హెచ్ఎంపీవీ HMPV Virus వైరస్ కేసులు.. ఇండియాలో నమోదు కావటంతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు భయం పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే సూచీలు దారుణంగా పతనం అయ్యాయి. సాయంత్రంలోపు మరో కేసు భయటపడటంతో స్టాక్ మార్కెట్లు ఏకంగా 1258 పాయింట్ల వరకు పతనం అయ్యాయి. వైరస్ భయంతో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావటంతోనే స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా ఒక్కరోజులోనే రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైందని పేర్కొన్నారు. మదుపర్ల సంపద ప్రస్తుతం రూ.439 లక్షల కోట్లుగా ఉందని వివరించారు.

ఇంట్రాడేలో 1500 పాయింట్ల వరకు పతనం అవ్వగా, మార్కెట్ ముగిసే సమయానికి 1258 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు.. వైరస్ భయం.. హాస్పిటల్స్‌కు మాత్రం జోరుగా సాగాయి. హాస్పిటళ్ల స్టాక్స్ రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఆసియా పరంగానూ స్టాక్ మార్కెట్లు ఢీలా పడ్డాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. పలు దేశాలపై టారిఫ్ పెంచుతారన్న ఆందోళనల నేపథ్యంతో జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్