బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధర భారీగా పడిపోయాయి. గత రెండు రోజుల నుంచి మరోసారి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో మాంద్యం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీని ప్రభావం నేడు భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,380.55 పాయింట్ల నష్టంతో 78,601.41 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, NSE నిఫ్టీ 719.70 పాయింట్లు పడిపోయి 23,998.00 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 24 వేల కీలక మద్దతును బ్రేక్ చేసింది. మార్కెట్‌లో తగ్గుదల కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ మరింతగా 7-10 శాతం పడిపోవచ్చు. ఇదే జరిగితే మార్కెట్ 23,000 వద్ద మద్దతు పొందుతుంది. మార్కెట్‌లో భారీ పతనం బంగారం, వెండి ఇన్వెస్టర్లకు మళ్లీ సువర్ణావకాశాన్ని తెచ్చిపెట్టింది. బంగారం, వెండి మళ్లీ పెరుగుతుందని కమోడిటీ నిపుణులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో విక్రయాలు కనిపిస్తున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. అదే సమయంలో, ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధ భయం పెరుగుతోంది. ఇది భౌగోళిక రాజకీయ అనిశ్చితిని పెంచుతుంది. ఇది స్టాక్ మార్కెట్‌కు ఏమాత్రం మంచిది కాదు. రానున్న కాలంలో స్టాక్ మార్కెట్ పతనం మరింత పెరిగే అవకాశం ఉంది.స్టాక్ మార్కెట్లు పతనం అవుతే.. బంగారం, వెండి ధరలను పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బంగారం వెండిలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు 'వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్ అయితే కొనుగోలు చేయడానికి ఇదొక సువర్ణావకాశం. త్వరలో బంగారం 10 గ్రాములకు రూ.75,000 స్థాయిని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.
బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. రానున్న కాలంలో పండుగల సీజన్ ప్రారంభం కానుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడంతో ధర మళ్లీ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం. వచ్చే రెండేళ్లలో బంగారం 15% నుంచి 18% రాబడిని ఇస్తుందని అంచనా.