Repo Rate RBI | వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్||

అందరు అనుకున్నట్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఎంపీసీ సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంకు రేట్లు సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు తెలిపారు. వడ్డీ రేట్లను మార్చకుండా ఇలాగే కొనసాగించడం ఇది వరుసగా నాలుగోసారి. అయితే, ఆగస్టుతో పోల్చితే ఈ సారి ద్రవ్యోల్బణం పెరిగింది. వృద్ధి ఆశాజనకంగానే ఉన్నా, అంతర్జాతీయ అంశాలు ప్రతికూలంగా మారాయి. కూరగాయలు, వంటగ్యాస్ ధరలు తగ్గిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం దిగి వచ్చే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. 

పాలసీ రేట్లు ఇలా.. రెపో రేటు - 6.50%, ఎస్‌డీఎఫ్‌ఆర్‌- 6.25%, ఎంఎస్‌ఎఫ్‌ఆర్‌- 6.75%, బ్యాంక్‌ రేటు- 6.75%, రివర్స్‌ రెపో రేటు- 3.35%గా ఉన్నాయి. కాగా, ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతం, 2023-24 రెండో త్రైమాసికంలో 6.4 శాతం, 2023-24 మూడో త్రైమాసికంలో 5.6 శాతం, 2023-24 నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం, 2024-25 తొలి త్రైమాసికంలో 5.2 శాతం ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 6.5 శాతంగా పేర్కొంది.




వెబ్ స్టోరీస్