టికెట్ రిజర్వేషన్లపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సీటీసీ IRCTC ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ప్రయాణానికి 120 రోజుల ముందు బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండగా, దాన్ని 60 రోజులకు కుదిస్తూ షాక్ ఇచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : టికెట్ రిజర్వేషన్లపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సీటీసీ IRCTC ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ప్రయాణానికి 120 రోజుల ముందు బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండగా, దాన్ని 60 రోజులకు కుదిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు 224 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునేవారికి కూడా పాత నిబంధనే వర్తిస్తుంది. ఇక.. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్ల టికెట్ బుకింగ్‌ల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టంచేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆ రైళ్లలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని వివరించారు. విదేశీయులు కూడా ఎప్పటిలాగే 365 రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మార్పు చేయటం లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత వాడుకోవడానికి భారతీయ రైల్వే శాఖ సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం ఫుడ్ క్వాలిటీ, లెనిన్ క్లాత్‌ల పర్యవేక్షణకు ఏఐ కెమెరాలు వాడుతుండగా, రైళ్లలో ఆక్యుపెన్సీ కోసం కూడా ఏఐ కెమెరాలను వాడనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా బెడ్ షీట్ల శుభ్రత కోసం ఏఐ కెమెరాలు వినియోగించగా, 100 శాతం ఫలితం వచ్చింది. అందుకే ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.