తగ్గని ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

stock markets india

ప్రతీకాత్మక చిత్రం

ముంబై, ఈవార్తలు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇటు.. భారత స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతింటున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే.. 3,900 పాయింట్ల సెన్సెక్స్ నష్టం చవిచూశాయి. 2,800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడింగ్ నడుస్తోంది. మరోవైపు, 900 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అంటే ఏకంగా.. భారత స్టాక్‌ మార్కెట్లు 5 శాతం నష్టపోయాయి. ఈ లెక్కన 10 నెలల కనిష్ఠానికి సెన్సెక్, నిఫ్టీ పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇదిలా ఉండగా,  అంతర్జాతీయ మార్కెట్లపైనా ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్ భారీగానే పడుతోంది. హాంకాంగ్‌ మార్కెట్‌లో చైనా షేర్లు 9 శాతం పతనం అయ్యాయి. జపాన్‌ నిక్కీ 8 శాతం.. కొరియా కోస్పి 5 శాతం డౌన్‌ అయ్యాయి. ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ కూడా 6 శాతం పడిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్